నవతెలంగాణ-హైదరాబాద్ : తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా.. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకొనేలా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొవ్వొత్తుల వెలుగులతో సీఎం కేసీఆర్, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. అమరుల నివాళి గీతంతో నివాళులర్పించారు. సభలో 10 వేల మంది క్యాండిల్ లైట్ ప్రదర్శిస్తూ అమరులకు నివాళులర్పించారు. అనంతరం ఎంపిక చేసిన ఆరుగురు అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ సత్కరించారు.