మణిపూర్ లో క్రిస్టియన్  దాడుల్లో మృతి చెందిన వారికి నివాళులు..

నవతెలంగాణ -డిచ్ పల్లి
మణిపూర్ లో జరుగుచున్న క్రిస్టియన్ ల పై దాడి నీ ఖండిస్తూ మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ఓదార్పు జరగాలని రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పాలని కోరుతూ ఆదివారం డిచ్ పల్లి మండలం లోని బర్దిపూర్ చర్చిలో క్రిస్టియన్ సోదరులు, మహిళలు ప్రార్థన చేసి క్యాండిల్స్ వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం లో రేవా జీ దినకరన్, నీరడి పద్మారావు, ఎన్ దేవరాజ్, ఎస్ పద్మారావు, ప్రభాకర్, సురేందర్, రమేష్, తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love