ట్రిపుల్ ఐటీలో విధ్యార్థుల కోట్లాట పట్టించుకోని ట్రిపుల్ ఐటీ సిఐ..?

నవతెలంగాణ-ముధోల్ : బాసర ట్రిపుల్ ఐటీ లో విధ్యార్థులు  బుధవారం రాత్రి కొట్టుకున్నట్లు తెలిసింది.అయితే ట్రిపుల్ ఐటీలో భద్రత ను నిరంతరం పర్యవేక్షణ కోసం నియమించిన సిఐ పట్టించుకోకపోవడంతో సమస్య జఠిలంగా మారినట్లు విమర్శలు వ్యక్తం వ్యక్తం అవుతున్నాయి.ట్రిపుల్ ఐటీ లో చదువుకుంటున్న జూనియర్, సీనియర్ విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నట్లుస్థానికంగాప్రచారంజరుగుతోంది.విద్యార్థులపాతగొడవలతోదాడిచేసుకున్నారా ,లేదా ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొన్నటి నిరసనలో  పాల్గొన్న విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికి ఈ దాడికి కారణం కావచ్చు అని  పలు విద్యార్థి సంఘాలు  అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు కలిసిమెలిసి ఉండే విద్యార్థులు కొట్టుకోవడం లోయజమాన్యంపాత్రపైకూడాభిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతుంన్నాయి.ట్రిపుల్ ఐటి లో  గణేష్ నిమజ్జన శోభాయాత్ర కోనసాగుతుండగా  ఈ ఘటన జరిగిన్నట్లు సమాచారం.ఈ ఘటన విషయం  ట్రిపుల్ ఐటీఎఓదృష్టికివిధ్యార్థులుతీసుకెళ్లినట్లుసమాచారం.ఈసంఘటన పై బాసర ఎస్ ఐ గణేష్ ను గురువారం సాయంత్రం నవతెలంగాణ ఫోన్లో వివరణ కోరగా ట్రిపుల్ ఐటీ లో గొడవ జరుగుతున్నట్లు 100 డయల్ రావటంతో తమ సిబ్బందితో ట్రిపుల్ ఐటీ కి వెళ్లడం జరిగిందన్నారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని వివరణ ఇచ్చారు.
Spread the love