ట్రిపుల్ ఐటీ వీసీపై విచారణజరిపించాలి

– ఉప ముఖ్యమంత్రికి విన్నవించిన ఓయు జెఏసి నాయకులు
నవతెలంగాణ-ముధోల్ : ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ -2 గా,బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జి వీసీగా  నియమితులై,జోడుపదవుల్లో ఉంటూ అనేక అక్రమాలకు పాల్పడిన వెంకట రమణను తక్షణమే ఇన్చార్జి వీసీ పదవీ నుండి తొలగించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు శనివారం రోజు హైదరాబాద్ లో ముధోల్ ప్రాంతానికి చెందిన ఓయు జెఏసి నాయకులు సర్థార్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. నకిలీ బిల్లుల చెల్లింపుల మీద , తన దగ్గర సంబంధికులకు అక్రమంగా ఉద్యోగాలు కట్టబెట్టి లక్షల రూపాయల జీతాలు కట్టబెడుతున్న వీసీ పై చర్యలు తీసుకోవాలని వారు విన్నవించారు.తనకు లొంగని మహిళ ఉద్యోగులను వేధించి తొలిగించిన ఘటనలు ఉన్నాయని అన్నారు.తనకు నచ్చిన వారికి అర్హతలు లేకున్నా ఉద్యోగాలు వీసీ ఇచ్చాడని వారు పేర్కొన్నారు.చేయని పనులకు చేసినట్టు బిల్లు లు తీసుకుంటూ,పాత పెండింగ్ బిల్లులను  నుండి చెల్లించి పర్సంటేజ్ లు వీసీ తీసుకున్నరని వారు ఆరోపించారు.ఆలాగే కాలo ముగిసిన తర్వాత కూడా అవే మెస్ కాంట్రాక్టర్ లను కొనసాగిస్తూ పెద విద్యార్ధులకు చెందాల్సిన డబ్బులను తన అవసరాలకు వాడుకుంటన్నారని తెలిపారు .అవసరం లేకున్నా నూతన వాహనాల కొనుగోలు చేసి, తన ఇంటికీ వాడుకుంటూ ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని వారు తెలిపారు. అనేక అక్రమాలకు పాల్పడుతున్న ఇంచార్జి వీసీ వేంకట రమణ మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేసి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు . ఈకార్యక్రమంలో చెన్నూరు ఎంఎల్ఏ వివేక్ వేంకట స్వామి, మాజీ ఎంపి మదు యాష్కీ గౌడ్ ,విద్యార్ధి జేఏసీ నేతలు సర్ధార్ వినోద్ కుమార్, పేరాల ప్రశాంత్,రంజిత్ కుమార్, ప్రవీణ్, దిలిప్ జిల్లపెల్లి, శేఖర్ యాదవ్ , వికాస్ యాదవ్ తదితరులు, పాల్గొన్నారు.
Spread the love