హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో బాసర ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో ట్రిపుల్ ఐటీ వీసీగా అవకాశం కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రిపుల్ ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని వీసీ కోరారు. ట్రిపుల్ ఐటీ అభివృద్ధి కృషి చేస్తానని సీఎం హామి ఇచ్చినట్లు వీసీ తెలిపారు.