– నాబార్డ్ ఛైర్మన్ సాజీ అంచనా
హైదరాబాద్ : తృణ ధాన్యాల ఉత్పత్తి 2030 నాటికి మూడు రెట్లు పెరగనుందని నాబార్డ్ ఛైర్మన్ సాజీ కెవి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన మిల్లెట్స్ కాన్‌క్లేవ్‌లో సాజీ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో 17 మిలియన్ టన్నుల తృణ ధాన్యాల ఉత్పత్తి జరుగుతుందని.. 2030 నాటికి 45 మిలియన్ టన్నులకు చేరొచ్చన్నారు. పౌష్టికహార భద్రతలో తృణధాన్యాలు కీలక పాత్ర పోశిస్తున్నాయన్నారు. ఇతర ధాన్యాల దిగుబడి కాలంతో పోల్చితే 60 శాతం సమయం ముందే తృణ ధాన్యాల పంట చేతికి వస్తుందన్నారు.