– సీపీఐ(ఎం) అభ్యర్థి దారుణ హత్యకు నిరసనగా…
న్యూఢిల్లీ : త్రిపురలో ఆగస్టు 8న జరిగే జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయనున్న సీపీఐ(ఎం) అభ్యర్థిని బీజేపీ గూండాలు దారుణంగా హత్య చేయడానికి నిరసనగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బంద్ పూర్తిగా విజయవంతమయింది. ప్రతిపక్ష పార్టీలు పిలుపు మేరకు జరిగిన ఈ బంద్‌లో ప్రజలు స్వచ్ఛంధంగా ఈ బంద్‌లో పాల్గొన్నారు. వ్యాపారాలు తమ దుకాణాలు మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ 12 గంటల పాటు ఈ బంద్ జరిగింది. దక్షిణ త్రిపుర జిల్లా పరిషత్ స్థానం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాదల్ శీల్ (49)పై ఈ నెల 12న రాజ్‌నగర్ వద్ద బీజేపీ గూండాలు దారుణంగా దాడికి పాల్పడ్డారు. దీంతో శీల్‌ను త్రిపుర రాజాధాని ఆగర్తలలోని జేబీపీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ శీల్ మరణించాడని త్రిపుర లెఫ్ట్ ఫ్రంట్ కన్వీనర్ నారాయణ్ కర్ తెలిపారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి అనేక మంది లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై బీజేపీ గూండాలు దాడులకు పాల్పడు తున్నారని నారాయణ్ కర్ తెలిపారు. బాదల్ శీల్‌పై జరిగిన దాడి గురించి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి వివరిస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థులు తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలు చేయడం కోసం రాజ్‌నగర్ హెచ్‌ఎస్ పాఠశాల వద్దకు చేరుకున్నప్పుడు అప్పటికే అక్కడ వేచి ఉన్న బీజేపీ సాయుధ గూండాలు పదునైన ఆయుధాలతో వారిపై దాడి చేశారని తెలిపారు. ఈ దాడిలో సీపీఐ(ఎం)కు చెందిన పలువురు కార్య కర్తలు గాయపడ్డారని, శీల్ తలకు బలమైన గాయం తగిలిందని చెప్పారు. శీల్ హత్యకు నిరసనగా బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు చెప్పారు. మరో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా ఈ బంద్‌కు మద్దతు ప్రకటించింది.
శీల్‌ను హత్యను ఖండించిన ఏఐకేఎస్
బిజెపి గూండాల చేతిలో బాదల్ శీల్ దారుణంగా హత్యకు గురికావడాన్ని ఏఐకేఎస్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. త్రిపుర కిసాన్ సభ యొక్క దక్షిణ త్రిపుర జిల్లా కమిటీలో శీల్ సభ్యులని తెలిపింది. శీల్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. బాదల్ శీల్ ఉపాధ్యాయుడని, తరువాత దక్షిణ త్రిపురలో రైతు, వ్యవసాయ కార్మికుల ఉద్యమాన్ని నిర్మిం చడంలో కీలక పాత్ర పోషించారని తెలిపింది. ఈ తరువాత ఏఐకేఎస్ బెలోనియా సబ్ డివిజన్ కమిటీ, దక్షిణ త్రిపుర జిల్లా కమిటీ సభ్యునిగానూ ఎన్నిక య్యాడని తెలిపింది. శీల్ గతంలోనూ అనేక ప్రాణాంతకమైన దాడులను ఎదుర్కొ న్నారని, రాజ్‌నగర్ ప్రాంతంలో రైతు, ప్రజాస్వామిక ఉద్యమాలను బలహీన పర్చిందుకు, ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు బీజేపీ అతన్ని లక్ష్యంగా చేసుకుందని తెలిపింది. శీల్ హత్య కేసులో ఇప్పటి వరకూ పోలీసులు ఎవ్వరీని అరెస్టు చేయలేదని, బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నేరగాళ్లకు రక్షణ కల్పిస్తోందని విమర్శించింది. కొన్ని వార్తల ప్రకారం దాడికి పాల్పడిన వారు బంగ్లా దేశ్‌కు పారిపోయినట్లు తెలుస్తోందని తెలిపింది. శీల్ హత్య, త్రిపురలో బీజేపీ చేస్తున్న హత్యా, హింసా రాజకీయాలకు నిరసనగా త్రిపుర ప్రజలు ఆది వారం 12 గంటల పాటు బంద్‌లో పాల్గొన్నారని తెలిపింది. శీల్ మరణం పట్ల ఎఐకెఎస్ సంతాపం వ్యక్తం చేసింది. అతని భార్య, కుమార్తె, త్రిపుర కిసాన్ సభ కార్యకర్తలకు సానుభూతి ప్రకటించింది. అలాగే, ఇలాంటి పిరికి దాడులకు త్రిపుర కిసాన్ ఉద్యమం ఎప్పటికీ లొంగిపోదని తెలిపింది. త్రిపురలో ప్రజా స్వామ్య, చట ్టబద్ధ పాలనను పునరుద్ధరించే పోరాటంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజ లను కూడగట్టడం ద్వారా హింసను ప్రతిఘటిస్తుందని ఏఐకేఎస్ తెలిపింది. రైతు ఉద్యమ కార్మికులతోనూ, త్రిపుర ప్రజాస్వామ్య ఉద్యమంతోనూ చేతులు కలు పుతూ బీజేపీ నేతృత్వంలోని నియంతృత్వ, మతోన్మాద శక్తులపై ఏఐకేఎస్ పోరాడుతుందని స్పష్టం చేసింది.