కిర్గిస్థాన్‌లో భారత విద్యార్థులకు ఇక్కట్లు

నవతెలంగాణ – హైదరాబాద్: కిర్గిస్థాన్‌లో పాకిస్థాన్ చేసిన తప్పుకు భారత్ మూల్యం చెల్లించుకుంటోంది. అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులపై కిర్గిస్థాన్ విద్యార్థులు దాడులకు తెగబడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ రెస్టారెంట్ వద్ద కిర్గిస్థాన్ యువకులపై పాక్ విద్యార్థులు దాడి చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో స్థానికులు దక్షిణాసియా విద్యార్థులు ఉండే హాస్టళ్లలోకి చొరబడి చితకబాదుతున్నారు.

Spread the love