పెర్కిట్ బస్టాండులో కంట్రోలర్ లేక ప్రయాణికుల ఇబ్బందులు

నవతెలంగాణ – ఆర్మూర్ 

మున్సిపల్ పరిధిలోని  పెర్కిట్   బస్టాండ్ లో కంట్రోలర్ లేకపోవడం వలన  ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు..కంట్రోలర్ లేక ఎప్పుడూ ఏ బస్సు వస్తుందో తెలియక ప్రయాణికులు అసౌకర్యానికి గురి అవుతున్నారు. ఆటోలు బస్టాండ్ లోపలికి వచ్చి ప్రయాణికులను తీసుకెళ్తున్నారు.కంట్రోలర్ లేక ప్రయాణికులకు బస్టాండ్ పరిపాలన నిర్వహణ గాడి తప్పి అస్తవ్యస్తంగా మారింది. దొంగ ఎవరో దొర ఎవరో తెలియకుండా ఆర్టీసి అధికారులు బస్టాండ్ ను గాలికి వదిలేసి చోద్యం చూస్తున్నారని, ప్రయాణికులు తీవ్ర నిరసన తెలియజేస్తున్నారు.బస్టాండ్ ను కంట్రోల్ చేయడానికి వెంటనే కంట్రోలర్ ను నియమించాలని, ఎండలు తీవ్రమైతున్న ఈ  సందర్భంగా చలివేంద్రాన్ని కూడా ఏర్పాటుచేయలేక  ప్రజల దాహార్తిని తీర్చలేక అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న ఆర్టీసి అధికారులపై ప్రయాణీకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కంట్రోలర్ ను నియమించి ప్రజలకు అందుబాటులో ప్రయాణ వసతులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిపో మేనేజర్ ను కోరుతున్నారు.
Spread the love