నవతెలంగాణ – హైదరాబాద్: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో భీకర ఉగ్రదాడిని తలచుకుంటే ఇప్పటికీ వణుకు వస్తుంది. అప్పటి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారత ప్రధాని అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ప్రకటన రావడం గమనార్హం. ‘26/11 ముంబయి ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌కు అప్పగిస్తున్నాం’ అని ట్రంప్ విలేకరులతో పేర్కొన్నారు. ఈ ప్రకటనపై మోడీ హర్షం వ్యక్తం చేశారు. ముంబయి ఉగ్రదాడి నేరస్థుడిని భారత్‌కు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసిన ట్రంప్‌నకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.