అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ గురువారం తనకు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మధ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ”అతను కలవాలనుకుంటున్నాడు, మేం దానిని ఏర్పాటు చేస్తున్నాం” అని ట్రంప్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని తన మార్-ఎ-లాగో నివాసంలో రిపబ్లికన్ గవర్నర్‌లతో సమావేశానికి ముందు చెప్పారని రాయిటర్స్ తెలిపింది. సమావేశం ఎప్పుడు జరుగుతుందో ఆయన పేర్కొనలేదు.
జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న ట్రంప్, కీవ్‌కు పదవీ విరమణ చేసే అధ్యక్షుడు జో బైడెన్ బేషరతుగా సహాయం చేయడాన్ని విమర్శించారు. తన ఎన్నికల సమయంలో, రష్యా, ఉక్రెయిన్‌లను త్వరగా చర్చలు పునఃప్రారంభించమని బలవంతం చేస్తానని ట్రంప్ వాగ్దానం చేశారు. అదనపు సైనిక, ఆర్థిక సహాయం అందించమని పాశ్చాత్య దేశాలకు ఆయన నిరంతరం చేసిన అభ్యర్థనలను ప్రస్తావిస్తూ ఉక్రెయిన్ నాయకుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీని ”భూమిపై గొప్ప సేల్స్‌మ్యాన్” అని కూడా ఆయన అభివర్ణించారు.
ట్రంప్ శాంతి కోసం స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను వెల్లడించనప్పటికీ, ప్రస్తుత ఫ్రంట్ లైన్‌లో సంఘర్షణను స్తంభింపజేయాలని ఆయన బ ృందం పరిశీలిస్తున్నటుఅట మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. గురువారం విలేకరులతో మాట్లాడుతూ, క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ, ట్రంప్-పుతిన్ సమావేశం కోసం మాస్కోకు ”ఎటువంటి అభ్యర్థనలు అందలేదని” అన్నారు. ”ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించే వరకు వేచి ఉండటమే మంచిది” అని పెస్కోవ్ అన్నారు.
ట్రంప్ పదవీ స్వీకార దినోత్సవం తర్వాత 100 రోజుల్లోపు రష్యన్ , ఉక్రెయిన్ మధ్య ఒప్పందాన్ని కుదుర్చుకోగలడని కాబోయే ఉక్రెయిన్ రాయబారి కీత్ కెల్లాగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2022లో రష్యా ఉక్రెయిన్‌లో సైనిక చర్యను ప్రారంభించినప్పటి నుంచి పుతిన్‌తో మాట్లాడకపోవడాన్ని కూడా ఆయన విమర్శించారు. 2022 వసంతకాలంలో మాస్కో, కీవ్ ల మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఇరుపక్షాలూ అవాస్తవ డిమాండ్లు చేస్తున్నాయని ఒకరినొకరు నిందించుకున్నాయి. పుతిన్ ప్రకారం, ఉక్రెయిన్ బ ృందం రష్యా నిబంధనలలో కొన్నింటికి అంగీకరించింది, కానీ అకస్మాత్తుగా చర్చల నుంచి తప్పుకుంది. 2022లో రష్యా నిబంధనలకు అంగీకరించవద్దని పాశ్చాత్య దేశాలు కీవ్‌కు సలహా ఇచ్చాయని మాజీ సీనియర్ స్టేట్ డిపార్ట్ మెంట్ అధికారి విక్టోరియా నులాండ్ తరువాత వెల్లడించారు.