– త్వరలోనే వెలుగులోకి వస్తుంది
– ఏపీ సర్కారుకు పయ్యావుల కేశవ్ హితవు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడును అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ చెప్పారు. ఏపీ సర్కారు, సీఐడీ ఇష్టానుసారం వ్యవహరించాయని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ని ఎన్టీఆర్ భవన్‌లో విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో గత వారం రోజుల క్రితం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. కోర్టును సైతం తప్పు దోవ పట్టించి ఏపీ సీఐడి ప్రజల ముందుకు వచ్చి అసత్యాలను విపరీతంగా ప్రచారం చేస్తున్నదని వ్యాఖ్యానించారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిపోలేదంటూ గురువారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టడాన్ని తప్పుబట్టారు. సీఐడి ఆఫీసర్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి విలేకర్లతో అదే ఆసత్యాలను వల్లేవేయడ ం మొదలు పెట్టారని చెప్పారు. సిమెన్స్ సంస్థ అనేది ఒరిజనల్ కాదు. పేరు బాగుంది కదా అని చంద్రబాబు ఈ పేరు పెట్టుకున్నారని ప్రచారం చేయడం సరికాదని అన్నారు.