వీటిని ప్రయత్నించండి…

వీటిని ప్రయత్నించండి...శరీరంలో కొవ్వు పేరుకుపోయి సమస్యతో సతమతమవుతుంటారు చాలా మంది. ఈ కొవ్వు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే ఈ కింది చిట్కాలు పాటిస్తే కొవ్వును కరిగించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
– ఉదయం పరగడుపునే రెండు చెంచాల తేనెను గ్లాసు గోరు వెచ్చని నీటిలో బాగా కలిపి తాగాలి. ఇది పొట్ట దగ్గర కొవ్వును తగ్గించడానికి సహాయ పడుతుంది.
– ఒక గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పూర్తిగా పిండాలి. దీన్ని ఉదయాన్నే పర గడుపున తీసుకోవాలి. క్రమం తప్ప కుండా ఇలా చేస్తే కొవ్వు కరుగుతుంది.
– రెండు చెంచాల క్రాన్‌బెర్రీ జ్యూస్‌ను ఒక గ్లాసు నీటిలో కలిపి భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా చేస్తే తప్పక ఫలితం ఉంటుంది.
– ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అవిసె గింజెల పొడి ఓ చెంచా, తేనె ఓ చెంచా కలిపి ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు తాగాలి. ఇది కూడా పొట్ట దగ్గర కొవ్వును బాగా తగ్గిస్తుంది.
– ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నువ్వుల నూనె ఒక చెంచా, అల్లం రసం చెంచా మోతాదులో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. ఇది పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు తగ్గేందుకు ఇది సహకరిస్తుంది.
– గ్రీన్‌ టీ పొడి చెంచా, నిమ్మరసం పావు చెంచా, తేనె రెండు చెంచాల మోతాదులో తీసుకుని ఒక గ్లాసు నీటిలో కలపాలి. మూడు నిమిషాల పాటు బాగా కలిపాలి. దీన్ని రోజుకి రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

Spread the love