టీఎస్ ఎప్‌సెట్ అగ్రిక‌ల్చ‌ర్ హాల్ టికెట్లు విడుద‌ల‌

నవతెలంగాణ-హైద‌రాబాద్ : తెలంగాణ‌లో అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు జ‌ర‌గ‌నున్న టీఎస్ ఎప్‌సెట్ ప‌రీక్ష‌ల హాల్ టికెట్లు విడుద‌ల‌య్యాయి. ఫార్మ‌సీ విభాగానికి సంబంధించిన హాల్ టికెట్ల‌ను మాత్ర‌మే విడుద‌ల చేసిన అధికారులు.. ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్ల‌ను మే 1న అందుబాటులోకి తేనున్నారు. విద్యార్థులు త‌మ రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్, పుట్టిన తేదీ వివ‌రాల‌ను ఎంట‌ర్ చేసి త‌మ హాల్ టికెట్లు పొందొచ్చు. మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ ప‌రీక్ష‌లు, మే 7, 8 తేదీల్లో అగ్రిక‌ల్చ‌ర్ అండ్ ఫార్మ‌సీ విభాగానికి సంబంధించిన ప‌రీక్ష‌లు జ‌రగ‌నున్నాయి. ఈ ఏడాది ఎప్‌సెట్‌కు మొత్తంగా దాదాపు 3.54 ల‌క్ష‌ల మంది విద్యార్థులు రిజిస్ట్రేష‌న్లు చేసుకోగా, అగ్రిక‌ల్చ‌ర్ అండ్ ఫార్మా విభాగానికి 1,00,260 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. మిగ‌తా అంద‌రూ ఇంజినీరింగ్‌కు ద‌ర‌ఖాస్తు చేశారు. హాల్ టికెట్ల కోసం eapcet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌ను సంప్ర‌దించండి.

Spread the love