గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు టీఎస్ యుటిఎఫ్ మద్దతు..

నవతెలంగాణ- గోవిందరావుపేట
గ్రామపంచాయతీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని చేపట్టిన నిరవధిక సమ్మె కు టీఎస్ యుటిఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని టీఎస్ యుటిఎఫ్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. వాసుదేవ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం 12 గంటలకు, విరామ సమయంలో మండల టీఎస్ యుటిఎఫ్ బృందంతో కలిసి టీఎస్ యుటిఎఫ్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి వాసుదేవరెడ్డి హాజరై సమ్మెలో పాల్గొని పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కరించాలని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ  కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. 24000 మినిమం జీతం ఇవ్వాలని హెల్త్ కార్డులు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కే రఘురాం. ఎస్ రాజు, వెంకటేశ్వర్లు మరియు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
Spread the love