టిఎస్ఎల్ పిఆర్ బి – 2022 సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియా నిర్వహణ

నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూటుమెంటు బోర్డు నిర్వహిస్తున్న సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియా కార్యక్రమం ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్. ప్రవీణ్ కుమార్, ఐ.పి.యస్. ఆదేశాల మేరకు అదనపు డి.సి.పి (ఎ.ఆర్) గిరిరాజు ఆద్వర్యంలో నేడు ఉదయం 8 గంటల నుండి పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు సర్టిఫికేటు వెరిఫికేషన్ ప్రక్రియా నిర్వహించడం జరుగుతుంది.ఈ సందర్భంగా అభ్యర్థులు తమ సర్టిఫికేట్లను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది.మొదటి రోజుకు 600 మంది అభ్యర్థులను పిలవడం జరిగింది.ఈ సందర్భంగా పరిపాలన అధికారి ( ఎ.ఓ ) బి. శ్రీనివాస్, ఆఫీస్ సూపరింటెండెంటులు శంకర్, మక్సూద్ హైమద్, గోవింద్ సి.పి.ఓ కార్యాలయం సిబ్బంది, రిజర్వు విభాగం సిబ్బంది ఐ.టి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love