పోలీస్ రిక్రూటుమెంటులో టి.ఎస్.ఎల్.పి.ఆర్.బి 2022 సర్టిఫికేషన్ వెరిఫికేషన్

నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూటుమెంటు బోర్డు నిర్వహిస్తున్న సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియా కార్యక్రమం ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్. ప్రవీణ్ కుమార్, ఐ.పి.యస్. ఆదేశాల మేరకు అదనపు డి.సి.పి ( ఎ.ఆర్ ) గిరిరాజు ఆద్వర్యంలో నేడు ఉదయం 8 గంటల నుండి పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు సర్టిఫికేటు వెరిఫికేషన్ ప్రక్రియా శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా అభ్యర్ధులు తమ సర్టిఫికేట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.మూడవ రోజుకు 650 మంది అభ్యర్థులను పిలవగా అందులో 562 మంది అభ్యర్ధులు హజరు కాగ వారి ద్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా పరిపాలన అధికారి ( ఎ.ఓ) బి. శ్రీనివాస్, ఆఫీస్ సూపరింటెండెంటులు శంకర్, మక్సూద్ హైమద్ గోవింద్ మరియు సి.పి.ఓ కార్యాలయం సిబ్బంది, రిజర్వు విభాగం సిబ్బంది మరియు ఐ.టి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love