– నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని పలు గ్రామాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని వినతి.
నవతెలంగాణ- జక్రాన్ పల్లి
నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలను నూతన గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేయాలని గౌరవ పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావుని ఆయన స్వగృహంలో కలిసి టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ వివరించారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలలో గాంధీనగర్ మరియు ఇందిరానగర్, సంతోష్ నగర్, జింగ్యాల తాండ, మెట్టుమరి తాండ, నడిమితాండ, సాయి నగర్, చింతల్ తాండ, మరియు చంద్రాయన్పల్లి గ్రామాలలో జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని గ్రామాల అభివృద్ధి కోసం టిఎస్ ఆర్టిసి చైర్మన్, శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామ పంచాయతీలకు అనుసంధానంగా ఉన్న గ్రామాలను ప్రత్యేక గ్రామాలుగా గుర్తించాలని తెలియజేశారు.. అదేవిధంగా నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామాన్ని డిచ్పల్లి మండలంలో కలపాలని మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావుకి తెలియజేశారు. మల్లాపూర్ గ్రామస్తులకు డిష్పల్లి మండలంలో మార్కెట్ మరియు వివిధ పనులకు డిచ్పల్లి కేంద్రంగా నిర్వహిస్తారని, మల్లాపూర్ గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు డిచ్పల్లి మండలంలో మల్లాపూర్ గ్రామాన్ని కలపాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు ని విజ్ఞప్తి చేశారు.