ఐపీఎల్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్..

నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ అభిమానులకు టీఆస్ఆర్టీసీ చక్కని శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లోని ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేక బస్సులు నడపనుందని ఆర్టీసీ ప్రకటించింది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియంలో రేపు జరగబోయే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ మ్యాచ్ దృష్యా ప్రత్యేకంగా 60 బస్సులను నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సులను హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల నుండి మే 16వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11.30 గంటల మధ్య నడపనున్నారు. ఈ బస్సులు హైదరాబాద్ పరిధిలోని 24 రూట్లలో తిరగనున్నాయి. ఇక రేపు జరగబోయే మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్ కు కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే.. ప్లేఆఫ్స్ కు హైదరాబాద్ బెర్త్ కన్ఫామ్ చేసుకున్నట్లు అవుతుంది.

ప్రత్యేక బస్సులు

 • మియాపూర్ నుంచి ఉప్పల్ స్టేడియం – 4
 • ఘట్‌కేసర్ నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 4
 • హయత్ నగర్ నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 2
 • NGOస్ కాలనీ నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 4
 • ఇబ్రహీం పట్నం నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 2
 • ల్యాబ్ క్వార్టర్స్ నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 2
 • కోటి నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 2
 • అఫ్జల్ గంజ్ నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 2
 • లక్డీకాపూల్ నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 2
 • దిల్‌సుక్ నగర్ నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 2
 • జీడి మెట్ల నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 4
 • KPHB నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 2
 • మేడ్చల్ నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 2
 • MYP నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 2
 • JBS నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 4
 • HPT నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 2
 • ECIL X రోడ్స్ నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 2
 • బోవెన్‌పల్లి నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 2
 • చార్మినార్ నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 4
 • చాంద్రాయణగుట్ట నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 2
 • ఉప్పల్ 2లోని RGIC స్టేడియంకు ఎంపీ
 • కొండాపూర్ నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 2
 • BHEL నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 2
 • LB నగర్ నుండి RGIC స్టేడియం, ఉప్పల్ – 2 రూట్లలో ప్రయాణించనున్నాయి.
Spread the love