నవతెలంగాణ – హైదరాబాద్: టీఎస్ఆర్టీసీలో ఈనెల 17న రికార్డు స్థాయిలో ఆక్యుపెన్సీ రేషియో నమోదైనట్లు అధికారులు తెలిపారు. టికెట్ల రూపంలో రూ.22.45కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఆ రోజున బస్సులు 33.99 లక్షల కిలో మీటర్లు తిరిగాయని, 48.94 లక్షల మంది ప్రయాణించారని తెలిపారు. సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణం కావడంతో బస్టాండులు, బస్సులు కిటకిటలాడాయి.