నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్టీసీ బస్సు సర్వీసులపై ఎండల ప్రభావం పడింది. ఎండలు దంచికొడుతున్న వేళ గ్రేటర్ హైదరాబాద్‌లో వేళ బస్సులను తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సుల సంఖ్యను తగ్గించనుంది. మధ్యాహ్నం వేళ ప్రయాణికులు లేక పోవడంతో సర్వీసులను తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 17 నుంచి మధ్యాహ్నం వేళ సిటీ బస్సుల సంఖ్య తగ్గిస్తున్నట్లు అనౌన్స్ చేసింది.