– రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నలువాల స్వామి
నవతెలంగాణ – కరీంనగర్/భగత్ నగర్ :
విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఎస్ యూఈఈయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నలువాల స్వామి ఆధ్వర్యంలో విద్యుత్ ఎస్ఈ గంగాధర్ కి వినతిపత్రం అందజేశారు. టీఎస్ యూఈఈయూ -సిఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కరీంనగర్ సర్కిల్ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న పీస్ రేట్,అన్ మ్యానెడ్,ఆర్టిజన్స్ లు ,రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గృహ జ్యోతి పథకం వలన పీస్ రేట్ ఉద్యోగులకు వేతనాలు అందడం లేదని ,అన్ మ్యానెడ్ ఉద్యోగులను సంస్థలో విలీనం చెయ్యాలని ,జూనియర్ లైనెమెన్ లకు పదోన్నతి కల్పించాలని ,జీపీఎస్ పద్దతిలో పెన్షన్ ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో తిరుపతి ,శ్రీకాంత్, శ్రీనివాస్ ,రాంచందర్ నాయక్ ,నౌసి ,సంపత్ కుమార్ పాల్గొన్నారు