జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నీ
హైదరాబాద్ : జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నీ అండర్-15 బార్సు విభాగంలో సార్థక్ ఆర్య (పిఎస్‌పిబి) చాంపియన్‌గా నిలిచాడు. బుధవారం జరిగిన ఫైనల్లో కర్ణాటక ఆటగాడు దినేశ్‌పై 3-0తో గలుపొందిన సార్థక్ టైటిల్ సొంతం చేసుకుంది. 11-9, 11-7, 11-9తో వరుస సెట్లలోనే సార్థక్ ఆర్య విజయం సాధించాడు. అండర్-15 గర్ల్స్ విభాగంలో సిండ్రెల్లా దాస్ (పశ్చిమ బెంగాల్) విజేతగా నిలిచింది. టైటిల్ పోరులో 12-10, 11-9, 11-7తో హాసిని (తమిళనాడు)పై సిండ్రెల్లా దాస్ వరుస సెట్లలోనే గెలుపొందింది. ఇక అండర్-19 బార్సు విభాగంలో తెలంగాణ ఆటగాడు మెహ్రా క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. అవిరూప్ చక్రవర్తి (పశ్చిమ బెంగాల్)పై 11-7, 11-7, 11-8తో మెహ్రా గెలుపొందాడు.