10 వేల చేతి కర్రలకు ఆర్డర్ ఇచ్చాం : టీటీడీ ఈవో ధర్మారెడ్డి

నవతెలంగాణ – తిరుపతి: 10 వేల చేతి కర్రలకు ఆర్డర్ ఇచ్చామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం నిబంధనలు కొనసాగిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రూ. 45 వేలతో 10వేల చేతి కర్రలకు ఆర్డర్ ఇచ్చినట్టు వెల్లడించారు. అలిపిరిలో భక్తులకు కర్రలు ఇచ్చి నరసింహస్వామి ఆలయం వద్ద తీసుకుంటామని చెప్పారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను అనుమతిస్తామని స్పష్టం చేశారు.

Spread the love