నిజామాబాద్ జిల్లా కేంద్రం రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వం నిషేధించిన గంజాయిని అమ్ముతుండగా ఇద్దరిని అరెస్టు చేసినట్లు రెండవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ యాసీన్ అరాఫత్ బుధవారం తెలిపారు. రెండవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ యాసీన్ అరాఫత్ తెలిపిన వివరాల ప్రకారం.. నమ్మదగిన సమాచారం మేరకు బర్కత్పురా కాలనీలో నివాసముంటున్న అప్రోచ్ , మునీఫ్ ఖాన్ ఇద్దరు నాందేడ్ లో గల కరీం అనే వ్యక్తి నుండి గంజాయి చిన్న, చిన్న ప్యాకెట్లు తీసుకొని వచ్చి నిజాంబాద్ పట్టణంలో అమ్మడం జరిగిందని తెలిపారు. ఇద్దరి వ్యక్తులపై చాలా రోజుల నుంచి నిగా పెట్టి వీరిని బుధవారం పట్టుకోవడం జరిగిందన్నారు. వీరి దగ్గర నుంచి 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని అలాగే వీరు ఒక్కో ప్యాకెట్ లో ఐదు గ్రాములు చొప్పున తయారు చేసి అమాయకులైన యువతకి 200 రూపాల నుండి 300 రూపాల వరకు అమ్ముడం జరిగిందన్నారు. అఫ్రోజ్ ఖాన్ నిందితుడు ఇంతకు ముందు కూడా గంజాయి అమ్మిన కేసులు ఉన్నాయని వివరించారు. వీరిద్దరి దగ్గర మూడు సెల్ఫోన్లో, ఒక బైక్ సీజ్ చేశారు. పట్టణంలో ఎవరు గంజాయి సరఫరా చేసిన అమాయకులైన వారికి అమ్మిన దయచేసి పోలీసు వారికి సంబంధించిన వివరాలను తెలియజేయాలన్నారు. ఇటువంటి వాటిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని ఇలాంటి నిందితులపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు.