మాచారెడ్డి మండలంలో స్నాచింగ్ కేసులో ఇద్దరు అరెస్ట్ చేసి కోర్టుకు పంపినట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తేదీ 02/09/2024 నా గజ నాయక్ తండ కి చెందిన పందిరి రాజవ్వ చైన్ స్నాచింగ్ కేసులో నేరస్తులైన మ్యడం సంతోష్, గడి ముందటి మానస లను శుక్రవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా వారు అనుమానస్పదంగా కనిపించడంతో పట్టుకొని అరెస్టు చేసి విచారించగా వారు వరసకు మేనత్త అయిన పందిరి రాజావ్వ గొలుసును దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడంతో వారిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచి జేలుకు పంపించడం జరిగిందన్నారు. ఇట్టి నేరానికి పాల్పడిన సంతోష్, మానస అనే వ్యక్తులకు అప్పులు ఎక్కువైనందున ఎలాగైనా అప్పులు తీర్చాలని సంతోష్ కి వరుసకు మేనత్తయిన రాజవ్వ మెడలో నుండి చెయిన్ దొంగలించి అప్పులు తీర్చాలని సంతోష్, మానసలు ప్లాన్ చేసుకొని అట్టి చెయిన్ నీ దొంగలించుకుని వెళ్లి శుక్రవారం అట్టి చైను నీ ఎక్కడైనా అమ్ముకుందామని బైక్ పైన వెళ్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు.