నవతెలంగాణ-శంకరపట్నం : రెండు బైకులు ఢీకొని తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన తొడంగే సమ్మయ్య యాదవ్,తన బైక్ పైన పురంల నుండి కేశవపట్నం నుండి హైవే రోడ్డుకు బయలుదేరగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న ఓ బైకు ఢీకొనడంతో సమ్మయ్య, తల పై తీవ్ర గాయాలయ్యాయి.కాగా ఇరువురు రోడ్డు పై పడిపోయారు.అటుగా వెళుతున్న స్థానికులు చూసి 108 కు ఫోన్ సమాచారం అందివ్వడంతో సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులని అంబులెన్స్ లో ప్రధమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. పై వివరాలు తెలియాల్సి ఉంది.