రెండు బైక్ లు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ – పెద్దవంగర

రెండు బైక్ లు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలోని పెద్దవంగర పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఎడవెల్లి అశోక్ రెడ్డి తన ద్విచక్ర వాహనం పై తొర్రూరు వైపు వెళ్తుండగా, సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలంలోని జలాల్ పురం గ్రామానికి చెందిన బారాజు వెంకన్న తన కొడుకు తో కలిసి తన ద్విచక్ర వాహనం పై ఇంటికి వస్తున్నాడు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో రెండు బైకులు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీ కొన్నాయి. అశోక్ రెడ్డి కి తీవ్ర గాయాలు కాగా, వెంకన్న కు స్వల్ప గాయలు కావడంతో ఇరువురి క్షతగాత్రులను కుటుంబ సభ్యులు తొర్రూరు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Spread the love