శ్రీశైలం ఘాట్ రోడ్ లో రెండు కార్లు ఢీ..

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. శ్రీశైలం శిఖరం సమీపంలోని 7 వ మలుపు వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలం శిఖరానికి కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఆరుగురికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్ లో సుండిపెంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఇటీవల అదుపు తప్పి బస్సు లోయలో పడిన ఘటన మరువక ముందే మరో ప్రమాదం జరిగింది. శిఖరం సమీపంలో అతి ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. మలుపు పరిస్థితిని కారు డ్రైవర్లు అంచనావేయలేకపోవడంతో .. అదుపుచేయలేక ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే కార్లలో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్న అధికారులు మలుపుల వద్ద సూచికల బోర్డులు గాని.. ఆంక్షలు గాని పెట్టకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు మండిపడుతున్నారు.

Spread the love