నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని ముదేల్లి గ్రామానికి చెందిన మిద్దెల రవీందర్ 9 సంవత్సరాలు సుతారి శశాంక్ 9 సంవత్సరాలు అనే పిల్లలు ఈరోజు వాళ్ళ బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉన్నందువల్ల బాన్సువాడ వెళ్లి ఆలస్యంగా రావడంతో పాఠశాలకు వెళ్లలేదు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో టైరు ఆట ఆడుకుంటూ రవీందర్ అనే బాలుడు, చెల్లి మనీషా ఏడు సంవత్సరాలు, సుతారీ శశాంక్ అనే ముగ్గురు చిన్నారులు ముదేల్లిలోని పెద్ద చెరువు వైపు వెళ్లి అక్కడ రవీందర్ కాలకృత్యాలకి వెళ్లి కడుక్కుంటుండగా, ప్రమాదవశాత్తు చెరువులో పడ్డారు. చెరువులో మునిగిపోతుండగా అతన్ని కాపాడబోయిన శశాంక్ అనే బాలుడు కూడా మునిగి చనిపోయినాడు. పైన ఉన్న మనీషా వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులకు, గ్రామస్తులకు తెలుపగా, గ్రామస్తులు వచ్చి మృతదేహాలను చెరువులో నుండి బయటకు తీశారు. మిద్దెల రవీందర్ తండ్రి మిద్దెల రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ ఆంజనేయులు తెలిపారు.