నవతెలంగాణ – అమరావతి: తిరుపతిలో ఘోరం జరిగింది. తిరుపతిలోత్రిబుల్ మర్డర్ చోటు చేసుకుంది. వదిన,ఇద్దరు పిల్లలను చంపేశాడు మరిది. ఈ సంఘటన తిరుపతిలో బుధవారం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సునీనీత, దేవీశ్రీ, నీరజాలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు మరిది మోహన్. అన్నదమ్ములు గోడవలే ఈ హత్యకు కారణం అని పోలీసులు నిర్ధారించారు. ఇష్టం లేని పెళ్ళి చేయడమే ఈ హత్యకు కారణం అంటున్నారు. తమ్ముడు మోహన్ కు పెళ్ళి చేశాడు అన్న. పెళ్ళి అయిన కొద్దిరోజులకే విభేదాలతో తమ్ముడు, ఆమె భార్య విడిపోయారు. ఇక ఆ ఇద్దరినీ కలిపే ప్రయత్నం చేసే క్రమంలో గొడవలు చోటు చేసుకున్నాయట. ఆ గోడవలతో కసి పెంచుకున్న తమ్ముడు…వదిన,ఇద్దరు పిల్లలను చంపేశాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు మోహన్. అయితే… మోహన్ కు కొన్ని నెలల క్రితం ఇష్టం లేని వివాహం చేశాడట అన్న, వదిన. దీంతో అన్నా వదినలే తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని గత కొద్ది రోజులుగా ఆగ్రహంగా ఉంటున్న మోహన్…ఈ దారుణానికి పాల్పడినట్లు చెబుతున్నారు పోలీసులు.