మందుబాబులకు షాక్ … రెండు రోజులు వైన్స్ బంద్

నవతెలంగాణ హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5గంటలతో ముగిసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్టు సీపీ సందీప్‌ శాండిల్య వెల్లడించారు. ఇవాళ్టి నుంచి 30వ తేదీ సాయంత్రం 5గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలు మూసివేయనున్నట్టు చెప్పారు. ఎన్నికలు ముగిసేవరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఎక్కడా ఐదుగురికి మించి గుమిగూడొద్దని హెచ్చరించారు. ఈ మేరకు మూడు కమిషనరేట్ల కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధుల కోసం భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. 45వేల మంది రాష్ట్ర పోలీసులు, 3వేల మంది ఇతర శాఖలకు చెందిన సిబ్బంది, 50 కంపెనీల స్పెషల్ పోలీసులు,375 కంపెనీల కేంద్ర బలగాలు, పక్క రాష్ట్రాలకు చెందిన 23,500 మంది హోంగార్డులు(కర్ణాటక నుంచి 5వేలు, మహారాష్ట్ర నుంచి 5వేలు, ఛత్తీస్‌గఢ్ నుంచి 2500, మధ్యప్రదేశ్ నుంచి 2వేలు, ఒడిశా నుంచి 2వేల మంది హోంగార్డులు) బందోబస్తు విధుల్లో ఉండనున్నారు.

Spread the love