కోలిహాన్ గనిలో కూలిన లిఫ్ట్‌.. ఇద్దరు మృతి

నవతెలంగాణ – జైపూర్‌: రాజస్థాలోని ఝన్‌ఝును జిల్లాలో ఉన్న కోలిహాన్ గనిలో లిఫ్ట్‌ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో విజిలెన్స్‌ అధికారి మరణించగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌కు చెందిన కోలిహాన్ గనిలో మంగళవారం రాత్రి లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 14 మంది విజిలెన్స్ సభ్యుల బృందం గనిలో చిక్కుకుపోయింది. వారిలో ఎనిమిది మంది గనిలో 577 మీటర్ల లోతులో ఉండిపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ఎనిమిది మందిని గని నుంచి బయటకు తీశారు. కూలిన లిఫ్ట్‌లో ఉన్న ఆరు మందిని రక్షించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని జైపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఓ అధికారి మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Spread the love