డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష

నవతెలంగాణ – భిక్కనూర్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికీ నాలుగు రోజులు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై ఆనంద్ గౌడ్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసిన సమయంలో ఎస్కే జునాద్ పాషా, రాజిరెడ్డి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న కారణంగా జిల్లా మెజిస్ట్రేట్ ప్రతాప్ 200 రూపాయల జరిమానాతో పాటు 4 రోజులు జైలు శిక్ష విధించడం జరిగిందని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

Spread the love