నవతెలంగాణ -అమరావతి : విశాఖ జిల్లా పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ ఎఫ్‌జీడీ నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణ పనులు కొనసాగుతుండగా కేబుల్ వైర్ తెగిపడడంతో నలుగురు కార్మికులు 15 మీటర్ల ఎత్తు నుంచి కిందపడ్డారు. దీంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం . మృతులు బెంగాల్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.