ఢిల్లీలో రెండంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: రెండంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు మృతి చెందిన విషాద సంఘటన ఈ రోజు తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ఢిల్లీలోని కబీర్ నగర్‌లో జరిగింది. అర్ధరాత్రి 2:16 గంటల సమయంలో ఒక్కసారిగా రెండంతస్తుల భవనం కూలిపోవడంతో ఇంట్లో నివాసం ఉంటున్న 30 ఏళ్ల అర్షద్, 20 ఏళ్ల తౌహీద్ లకు తీవ్ర గాయాలు అయ్యాయి దీంతో వారిని హుటాహుటిన స్థానిక జీటీబీ ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందారు. అలాగే 22 ఏళ్ల రేహాన్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని నార్త్ ఈస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జాయ్ టిర్కీ తెలిపారు.

Spread the love