నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇద్దరు మావోయిస్టులు గురువారం లొంగిపోయారు. ఈ ఇద్దరిలో ఒక మావోయిస్టుపై రూ. లక్ష రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివిధ కారణాల వల్ల మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు ఆ ఇద్దరు పోలీసులకు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులను చేతన నాట్య మండలికి చెందిన వెట్టి రాజా, మిలిషీయా కమాండర్ రావ సోమగా పోలీసులు గుర్తించారు. రాజాపై రూ. లక్ష రివార్డు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరిద్దరికి పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు. లొంగిపోయిన మావోయిస్టుల కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తూ, ఉపాధి కల్పిస్తున్న సంగతి తెలిసిందే.