– నిద్రపోయిన నిఘానేత్రం
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
బాన్సువాడ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఒకే రోజు రెండు చోట్ల ఇద్దరు హత్యకు గురయ్యారు. మంగళవారం బాన్సువాడ పట్టణం పక్కనే ఉన్న కల్కి చెరువు వద్ద ఓ గుర్తుతెలియని మహిళలను కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తీసుకువచ్చి కాళ్లు చేతులు కట్టివేసి అతి దారుణంగా హత్యకు పాల్పడ్డారు. అలాగే సోమవారం రాత్రి బాన్సువాడ సరస్వతి ఆలయ సమీపంలో వాచ్ మెన్ గా పనిచేస్తున్న సాలె కొండ వెంకన్న (68)ను గుర్తుతెలియని వ్యక్తులు పీక కోసి హత్యకు పాల్పడ్డారు. వెంకన్న గత నాలుగైదేళ్ళుగా ఓ వ్యాపారి వద్ద వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి హత్య జరిగిన చోట పేకాట ఆడినట్లు ఆక్కడ పేకాట పత్తలు పడి ఉన్నాయి. దీంతో పాటు రెండు సెల్ ఫోన్లు, ఒకటి చిన్న ఫోను, హత్య జరిగిన సంఘటన వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడిన వారే కొండ వెంకన్నను హత్య చేసి ఉంటారని తెలుస్తోంది. సాలె వెంకన్నను హత్య చేయడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే కల్కి చెరువు వద్ద అదే రాత్రి (35) గుర్తు తెలియని ఓ మహిళ ను కాళ్లు చేతులు కట్టివేసి దారుణంగా హత్య చేశారు. వివహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురైన మహిళ ఎవరు అన్నది తేలితే అంతకులు పోలీసులకు చిక్కే అవకాశాలు ఉన్నాయి. ఒకే రాత్రి రెండు ఘటనలు జరగడం బాన్సువాడతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు జంట హత్యలు బాన్సువాడ డివిజన్ లో కలకలం రేపుతుంది. ఎల్లారెడ్డి డి.ఎస్.పి శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు తీసిన గల కారణాలను ఆరా తీస్తున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేనట్లుగా తెలుస్తుంది. బాన్సువాడ ప్రాంతంలో సీసీ కెమెరాలు పనిచేయక పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలు, హత్యలు, జరుగుతున్నాయి. ఒకవైపు పోలీస్ ఉన్నతాధికారులు సీసీ కెమెరాల ఆవశ్యకతపై అవగాహన సదస్సులు పెడుతూ వివరిస్తున్నప్పటికీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో ఒకవైపు పోలీస్ యంత్రాంగం, మరొకవైపు వ్యాపారులు, ఇంటి యజమానులు పట్టించుకోకపోవడం వల్ల బాన్సువాడ పట్టణంలో దొంగతనాలు, హత్యలు, అసాఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి బాన్సువాడ పోలీస్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో, రహదారుల కూడలి వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.