ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

నవతెలంగాణ- హైదరాబాద్ : శామీర్‌పేటలోని ఓఆర్ఆర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిలిచి ఉన్న లారీని ఇన్నోవా వాహనం వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మృతులు డ్రైవర్ మరుతి, ప్రయాణికుడు రాజుగా పోలీసులు గుర్తించారు. వీరు కుత్బుల్లాపూర్ వాసులు. కీసర నుండి మేడ్చల్ వైపు వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. శామీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసుని దర్యాప్తు జరుపుతున్నారు.

Spread the love