ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

నవతెలంగాణ – అమరావతి : కారు టైరు పేలి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలైన ఘటన శనివారం బంగారుపాలెం మండలంలోని కొత్తపల్లి బైపాస్‌ వద్ద జరిగింది. సిఐ శ్రీనివాసులు ఇచ్చిన సమాచారం మేరకు దొడ్డబలాపురానికి చెందిన 1. గోవిందప్ప కుమారుడు గంగరాజు (56), 2. నవీన్‌ భార్య లక్ష్మి (35), 3.గోవిందప్ప కుమారుడు శ్రీనివాసమూర్తి (51), 4.నరసింహమూర్తి భార్య తనూజ (36), 5.గంగరాజు భార్య సుచిత్ర (48), 6.శ్రీనివాసులు భార్య ఉష (32), 7.గంగరాజు కుమార్తె ధరణి (22) మొత్తంగా ఏడుగురు దొడ్డబల్లాపురం నుంచి ఇన్నోవా కారులో కంచిలోని ఆలయాలను సందర్శించారు. అనంతరం బట్టలు కొనుక్కోవడానికి బయలుదేరి వెళుతుండగా బంగారుపాలెం మండలం కొత్తపల్లి ఫ్లైఓవర్‌ వద్ద కారు టైరు పేలడంతో కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 1.గంగరాజు (56), 2.లక్ష్మి (35) మృతి చెందారు. మిగతా ఐదుగురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారిని బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించి అనంతరం మెరుగైన చికిత్స కోసం కోలార్‌ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని తహశీల్దార్‌ బాబు రాజేంద్రప్రసాద్‌ పరిశీలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love