సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

Accidentనవతెలంగాణ-హైదరాబాద్ : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగివున్న లారీ కిందికి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కకడే మృతి చెందారు. ఈ ఘటన మునగాల మండంలోని ముకుందాపురం వద్ద సోమవారం తెల్లవారుజూమున చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love