– మృతురాలు బీఆర్‌ఎస్ నాయకులు
– వికారాబాద్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం
నవతెలంగాణ-మొయినాబాద్
అదుపుతప్పి తుపాన్ వాహనం బోల్తా పడిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్- బీజాపూర్ రహదారిపై అజిజ్‌నగర్ ములమ లుపు వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం దామర్చేడ్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు హైదరాబాద్‌లో ఉన్న తమ గ్రామానికి చెందిన వారి ఓట్లు అభ్యర్థించడానికి హైదరాబాద్‌కు వస్తున్నారు. అజీజ్‌నగర్ వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో రమేష్(35), బోయ లక్ష్మయ్య (65) ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. వాహ నంలోని మరో ఆరుగురిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాతులను హైదరాబా ద్‌లోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఒక వ్యక్తి చిన్న చిన్న గాయాలతో బయట పడ్డా డు. ప్రమాదానికి కారణం అతివేగమేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.