నవతెలంగాణ-హైదరాబాద్ : అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని డీఆర్‌ఐ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి దాదాపు 4కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.3 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కోల్‌కతా నుంచి రోడ్డు మార్గం ద్వారా నగరానికి పసిడిని రహస్యంగా తరలిస్తున్నారన్న సమాచారంతో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.