నవతెలంగాణ – తాడ్వాయి
పసర వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని, వేగంగా వస్తున్న కారు బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మొండాల తోగులో పడ్డారు. వివరాల్లోకి వేళ్తే.. మంగపేట మండలానికి చెందిన తులెం సాయి, తోలెం నితిన్ అనే వ్యక్తులు బైక్ పై పసర వైపు వెళ్తున్నారు. పసర నుండి వేగంగా వస్తున్న కారు మొండాలతోగు వద్ద బైక్ ను ఢీ కొట్టింది. బైకు లేచి గాలిలో ఎగిరిపడి పక్కనే ఉన్న మొండాలతోగు లో పడిపోయింది. ఇద్దరి వ్యక్తులకు కాళ్లు విరిగి తీవ్ర గాయాల పాలయ్యారు. 108 ద్వారా ఎంజిఎంకు తరలించారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.