పెద్దపల్లిలో పాదచారులపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

నవతెలంగాణ – పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. పట్టణ శివార్లలోని రంగంపల్లి వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళలపై కారు దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన పద్మను స్థానికులు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతులను కుక్క అమృత, కుక్క భాగ్యగా గుర్తించారు. బాధితులంటా పెద్దపల్లి పట్టణం ఉదయ్‌ నగర్‌కు చెందిన వారని చెప్పారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love