పొలాల్లోకి దూసుకువెళ్లిన ట్రావెల్ బస్సు..ఇద్దరు మృతి

నవతెలంగాణ – నల్లగొండ
నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంట పొలాల్లో ట్రావెల్ బస్సు దూసుకుపోవడంతో..ఇద్దరు మృతి వ్యక్తులు మరణించారు. ఈ సంఘటన ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెం స్టేజ్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైకును ఢీ కొట్టి పొలాల్లో దూసుకువెళ్లింది ట్రావెల్ బస్సు. ఈ ప్రమాదంలో బైక్ పైన ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా.. మరొకరు పరిస్థితి విషమంగా ఉంది. ట్రావెల్‌ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love