లోయలోపడ్డ వాహనం..ఇద్దరు మృతి

  నవతెలంగాణ-హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో టెంపో వాహనం లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ఏపీలోని ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం తిరుమలదేవిపెట గ్రామానికి చెందిన భక్తులు భద్రాచలం రామాలయానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు జట్ల దుర్గారావు. పచ్చిపాల శ్రీనివాసరావుగా గుర్తించారు.

Spread the love