నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికీ జైలు శిక్ష పడిందని మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిబాబు మంగళవారం తెలిపారు. మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం నిజామాబాద్ 3వ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన నాందేవాడకు చెందిన బత్తుల యాదగిరి, సుభాష్ నగర్కు చెందిన నాగేల్లి గంగయ్య కోర్టులో హాజరుపరచగా స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అయినా నూర్జహాన్ బేగం ఒక్కొక్కరికి 1 రోజు జైలు శిక్ష విధించడం జరిగింది. తాగి వాహనాన్ని నడపడం చట్టరీత్యా నేరం కావున తాగి వాహనాలు నడపకండి అని ఎస్ఐ తెలియజేశారు.