పవన్ సభలో కత్తి కలకలం.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

 నవతెలంగాణ-హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. తనపై దాడికి రౌడీమూకలు ఎదురుచూస్తున్నాయంటూ తన భద్రతపై గతంలో పవన్ అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా నిన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సభలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పందంగా కనిపించారు. దీంతో పోలీసులు వారిని తనిఖీ చేయగా వారిలో ఒకరి వద్ద చాకు కనిపించింది. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా పోలీసులపైనే ఒకడు దాడిచేశాడు. చివరికి టూటౌన్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారు జేబుదొంగలా? లేదంటే పవన్‌పై దాడి కోసమే సభకు వచ్చారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులిద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవారని, వారిద్దరికీ ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు.

Spread the love