గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు అరెస్టు

నవతెలంగాణ-ఆర్మూర్

ఏ న్ ఫోర్స్ మెంట్ ఆఫ్ ప్రొహిబిషన్  ఎక్సైజ్ నిజామాబాద్ డివిజన్ కిషన్ ఆదేశాల మేరకు పట్టణ ఎక్సైజ్ సిబ్బంది గురువారం రూట్ వాచ్ లో గంజాయి సరఫరా చేస్తున్నారనే సమాచారంతో పట్టణం నుండి ముని పెళ్లి మార్గంలో గస్తీ నిర్వహిస్తుండగా రంజాన్ కుమార్ అనే వ్యక్తి దొండ శివకుమార్ అనే వ్యక్తి సహకారంతో ఎలక్ట్రిక్ టూవీలర్ పై 750 గ్రాముల గంజాయి తరలిస్తూ పట్టుబడడం జరిగిందని ఎక్సైజ్ సీఐ స్టీవెన్ సన్ తెలిపారు.. ఈ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి ఎక్సైజ్ స్టేషన్కు తరలించడం జరిగిందని అన్నారు.. ఈ గస్తీలో ఇన్ఫోర్స్మెంట్ సిఐ స్వప్న, ఎస్సైలు ప్రమోద్ చైతన్య, చంద్రమౌళి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love